Soundarya Lahari - 8
- YS
- Oct 21
- 2 min read
Updated: Oct 22
Soundarya Lahari - 8
सुधासिन्धोर्मध्ये सुरविटपिवाटीपरिवृते
मणिद्वीपे नीपोपवनवति चिन्तामणिगृहे।
शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयाम्
भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीम्॥
Sudhaasindhormadhye suravitapivaateeparivruthe
manidweepe neepopavanavathi chintaamanigruhe |
sivaakaaremanche paramasivaparyankanilayaam
bhajanthi tvaam dhanyaah katichana chidaanandalahareem ||
सुधासिन्धोः Sudhaasindhoh | of the Ocean of nectar (amrita) |
मध्ये Madhye | in the middle |
सुरविटपि Suravitapi | the trees of heaven, celestial trees, kalpavrikshas |
वाटी vaatee | garden of |
परिवृते parivruthe | surrounded by |
मणिद्वीपे manidweepe | in the island of gems |
नीपोपवनवति neepopavanavathi | having within the precincts the garden of Neepa trees |
चिन्तामणिगृहे chintamanigruhe | in the house of chintamanis |
शिवाकारे Shivaakaare | in the form of Sivaa |
मञ्चे Manche | on the cot |
परमशिव Paramasiva | Lord ParamaSiva |
पर्यङ्क Paryanka | bed |
निलयाम् nilayaam | seated on |
भजन्ति bhajanthi | worship |
त्वां thvaam | you |
धन्याः dhanyaah | blessed ones |
कतिचन kathichana | only few |
चिदानन्दलहरीम् chidaanandalahareem | the form of flow of consciousness-bliss |
Only a few blessed ones worship you, as the flow of consciousness bliss, who is in the lap of Parama Siva, seated on the cot which is the form of Sivaa, inside the house made of chintamanis, which has the garden of Kadamba trees in its precincts, in the island of made of self illuminating gems, which is surrounded by celestial trees (Kalpavrikshas) in the middle of the ocean of nectar.
సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే |
శివాకారేమంచే పరమశివపర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం ||
సుధాసింధోః | అమృతసముద్రపు |
మధ్యే | మధ్యలో |
సురవిటపివాటీ | కల్పవృక్షవనములతో |
పరివృతే | చుట్టుకొనబడిన |
మణిద్వీపే | మణిద్వీపమునందు |
నీపోపవనవతి | కడిమిచెట్లపూలతోట కలిగిన |
చింతామణిగృహే | చింతామణిగృహమునందు |
శివా ఆకారే మంచే | శివాకారమంచమునందు |
పరమశివపర్యంకనిలయాం | పరమశివుడనే శయ్యమీద |
భజంతి | భజించుచున్నారు |
త్వాం | నిన్ను |
ధన్యాః | ధన్యులు |
కతిచన | కొందరు మాత్రమే |
చిదానందలహరీం | జ్ఞానాకృతియై నిరతిశయ ఆనంద ప్రవాహ స్వరూపమగు |
అమృతసముద్రపు మధ్యలో కల్పవృక్షవనములతో చుట్టుకొనబడిన మణిద్వీపమునందు కడిమిచెట్లపూలతోట కలిగి, చింతామణులచే నిర్మింపబడిన గృహమునందు శివా ఆకార ((శక్తి స్వరూపమైన) మంచమునందు పరమశివుడనే శయ్యమీద జ్ఞానాకృతియై నిరతిశయ ఆనంద ప్రవాహ స్వరూపమై ఉన్న నిన్ను కొందరు ధన్యులు మాత్రమే భజించుచున్నారు.
Comments